కిరాణ దుకాణంలో మహిళల చేతివాటం - 20 లీటర్ల నూనె డబ్బా చోరీ - Three Women Theft 20 L oil can

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 20, 2024, 2:43 PM IST

Grocery Shop Theft In Warangal : దుకాణంలో నిత్యవసర వస్తువులను చాకచక్యంగా, యజమానికి తెలియకుండా చోరీ చేసి ముగ్గురు మహిళలు తప్పించుకున్నారు. ఇదే తరహా ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ ముగ్గురు మహిళలు కిరాణ షాపులో తమ చేతివాటం ప్రదర్శించారు. ఓ కిరాణం దుకాణానికి వెళ్లిన ముగ్గురు మహిళల్లో ఒకరు యజమానిని మాటల్లో పెట్టగా మరో ఇద్దరు మహిళలు 20 లీటర్ల నూనె డబ్బాను అపహరించి పరారయ్యారు. 

Three Women Theft : ఈ ఘటన వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో జరిగింది. కొంత సమయం తర్వాత వంట నూనె డబ్బా కనిపించక పోవడంతో షాపు యజమాని సీసీటీవీలను పరిశీలించగా ఆ ముగ్గురు మహిళల బండారం బయట పడింది. వారు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అనే కోణంలో బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఈ అపహరణ తతంగంలో సీసీ కెమెరాలు కీలకంగా మారగా మహిళల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.