జనసేన-టీడీపీ సభకు బస్సులు కేటాయించని ఆర్టీసీ - భగ్గుమంటున్న నేతలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 28, 2024, 12:40 PM IST
Govt Not Allocating Buses to Janasena-TDP Meeting : తాడేపల్లిగూడెంలో ఈరోజు జరగనున్న జనసేన - తెలుగుదేశం ఉమ్మడి బహిరంగ సభకు (Janasena- TDP public meeting) ప్రభుత్వం బస్సులు కేటాయించలేదు. ఉమ్మడి సభకు బస్సులు కేటాయించాలని జనసేన - తెలుగుదేశం నాయకులు కోరగా ప్రభుత్వం ఒక్క బస్సు కూడా కేటాయించలేదని నేతలు మండిపడ్డారు. 100 బస్సులు కావాలని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (Palakollu MLA Nimmala Ramanaidu), 50 బస్సులు కావాలని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు (Undi MLA Mantena Ramaraju) దరఖాస్తు చేశారు.
అయితే అధికారులు నేతల దరఖాస్తుల్ని తోసిపుచ్చారు. దీంతో ఇరుపార్టీల శ్రేణులు సొంత వాహనాల్లోనే సభకు భారీగా తరలి వచ్చేందుకు సిద్ధమయ్యారు. లక్షలాదిగా తరలి వచ్చే సభకు తగిన బందోబస్తు సిబ్బందినీ కల్పించలేదని జనసేన - తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. భద్రత విషయంలో ఇబ్బందులు తలెత్తేలా అధికారులు వ్యవహరిస్తున్నారని నేతలు ధ్వజమెత్తారు. అధికార పార్టీల సభలకు వందల సంఖ్యలో బస్సులు కేటాయిస్తున్న ఆర్టీసీ అధికారులు జనసేన - టీడీపీ ఉమ్మడి సభలకు మాత్రం బస్సులు కేటాయించట్లేదని విమర్శిస్తున్నారు.