లైన్మెన్ కోటేశ్వరరావు కుటుంబానికి పరిహారం- ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి గొట్టిపాటి - Govt Support To Lineman family - GOVT SUPPORT TO LINEMAN FAMILY
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 6, 2024, 12:17 PM IST
Government Support To Electricity Department Lineman Who Died in Duty : వరద సహాయక చర్యల్లో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ శాఖ లైన్ మెన్ కోటేశ్వరరావు కుటుంబానికి ప్రభుత్వం తోడ్పాటు అందించింది. విద్యుత్ శాఖ, ప్రభుత్వ పరంగా మెుత్తం 31 లక్షల రూపాయల పరిహారం కోటేశ్వరరావు భార్యకు అందజేసింది. మంత్రి గొట్టిపాటి రవికుమార్ బాధిత కుటుంబం ఇంటికెళ్లి పరిహారాన్ని అందజేశారు. కోటేశ్వరరావు భార్యకు విద్యుత్ శాఖలో ఉద్యోగంతో పాటు ఇద్దరు పిల్లలు డ్రిగ్రీ వరకూ చదువుకునేందుకు ఒక్కొక్కరికి 25 వేల రూపాయలు చొప్పున ఆర్థిక తోడ్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. కోటేశ్వరరావు కుటుంబానికి శాఖపరంగా రావాల్సిన మరో 30 లక్షల రూపాయల బెనిఫిట్స్‌ను త్వరలోనే అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
విజయవాడ వరద బాధితులను కాపాడడానికి పలువురు ఎంతగానో కృషి చేశారు. ఈ క్రమంలోనే విద్యుత్ శాఖ లైన్మెన్ కోటేశ్వరరావు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ పరిధిలోని అనేక కాలనీల్లో ఇప్పటికీ వరద ఉద్ధృతి తగ్గలేదు. కొన్నిచోట్ల ఇళ్లలోకి వచ్చిన నీరు వెనక్కి తగ్గినా, వీధులు కాల్వలను తలపిస్తున్నాయి. అధిక శాతం జనం ఇళ్లకే పరిమితమయ్యారు.