సచివాలయ ఉద్యోగుల సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదు? - నోటీసులు జారీ - Govt Notice to APSA - GOVT NOTICE TO APSA
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 26, 2024, 1:34 PM IST
Govt notices to Secretariat Employees Union: వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చేసిన ఓవరాక్షన్ ఆ సంఘం ఉనికికే ముప్పుగా మారింది. గత ఐదేళ్లూ జగన్ భక్తిలో తరించిన వెంకట్రామిరెడ్డి గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారనే అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెంకట్రామిరెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో వెంకట్రామిరెడ్డికి ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో వెంకటరామిరెడ్డి అందుబాటులో లేకపోవటంతో సచివాలయ ఉద్యోగ సంఘం కార్యదర్శి కృష్ణ, ఇతర ఆఫీసు బేరర్లు ప్రభుత్వ షోకాజ్ నోటీసుకు సమాధానం పంపారు. వెంకట్రామిరెడ్డి వ్యక్తిగత హోదాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని, సచివాలయానికి వెలుపల జరిగిన కార్యకలాపాల గురించి తమను ఎప్పుడూ సంప్రదించలేదని వివరణ ఇచ్చారు. సంఘం అధ్యక్షుడిగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఉంటే వ్యక్తిగతంగా ఆయనపైనే చర్యలు తీసుకోవాలన్నారు. ఒక వ్యక్తి గురించి సంస్థ గుర్తింపునే రద్దు చేసే నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నుంచి తప్పుకుంటున్నట్లు అప్సా ప్రధాన కార్యదర్శి కృష్ణ ప్రకటించారు.