నెల్లూరులో పాఠశాల గోడ కూలి విద్యార్థి మృతి - బాధిత కుటుంబానికి ప్రభుత్వం సాయం - five lakh to Students Family - FIVE LAKH TO STUDENTS FAMILY
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 30, 2024, 4:34 PM IST
Government Help to Student Family : నాడు-నేడు పనుల నాణ్యతా లోపం కారణంగా పాఠశాల గోడ కూలి మృతి చెందిన విద్యార్థి గురుమహేంద్ర కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. నిర్మాణంలో ఉన్న నెల్లూరు నగరం భక్తవత్సల నగర్‌లోని కేఎన్‌ఆర్ నగరపాలక పాఠశాల స్కూల్ గోడ కూలి 9వ తరగతి విద్యార్థి గురుమహేంద్ర 4 రోజుల క్రితం మృతి చెందాడు. గత ప్రభుత్వంలో నాడు-నేడు పనుల నాణ్యతా లోపం కారణంగానే ఈ విశాథ ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వం తరఫున విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. కాగా, కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజ తో కలిసి విద్యార్థి నివాసానికి వెళ్లిన నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వారికి చెక్కు అందజేశారు. విద్యార్థి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి ఇంటి స్థలం, మరో కుమారుడి చదువుకు సహకరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ ఘటనపై విచారణ చేయిస్తామని, మానవ తప్పిదం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
అనంతరం 36వ డివిజన్ లో కోటి పది లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అందరి సహకారంతో పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు తాము కృషి చేస్తామని ప్రకటించారు.