మెదక్ జిల్లాలో భారీ చోరీ - రూ.42 లక్షల విలువైన బంగారు బిస్కెట్లు, 18 తులాల బంగారు ఆభరణాల అపహరణ - Gold Biscuit Chori In Medak
🎬 Watch Now: Feature Video
Published : Mar 9, 2024, 10:28 PM IST
Gold Biscuit Chori In Medak : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట్లో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగులగొట్టి, గదిలో ఉన్న సుమారు రూ.42 లక్షల విలువైన బంగారు బిస్కెట్లు, అభరణాలను ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లింగారెడ్డిపేట్ గ్రామానికి చెందిన రమేష్, కాళ్లకల్లోని ఓ పరిశ్రమలో పని చేస్తున్నాడు. ఇతని మామ బోబిల్ల సత్తయ్య పది రోజుల క్రితం వెంకటాయపల్లిలో చనిపోగా, దశదిన కర్మ కోసం కుటుంబంతో కలిసి ఈ నెల 6న వెళ్లారు. కుటుంబ సభ్యులు ఇంటికి రాగా, ఇంటి తాళం పగులగొట్టి ఉండటం చూసి ఒక్కసారిగా కంగు తిన్నారు.
ఇంట్లోకి వెళ్లి చూడగా మంచం కింద ఉన్న కబోర్డులో ఉన్న 5 బంగారు బిస్కెట్లు (50 తులాలు), బీరువాలో పెట్టిన రూ.18 తులాల బంగారు అభరణాలు పోయాయని, దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి తూప్రాన్ సీఐ కృష్ణ చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.