గోల్కొండ కోటలో సౌండ్ అండ్ లైట్ షో - గోల్కొండలో సౌండ్ అండ్ లైట్ షో
🎬 Watch Now: Feature Video


Published : Jan 24, 2024, 12:50 PM IST
Golconda Sound And Light Show : చారిత్రక గోల్కొండ కోట అత్యాధునిక హంగులతో కనువిందు చేయబోతుంది. పర్యాటకులను పెంచడమే లక్ష్యంగా రాత్రి వేళ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా, ఈ కోట చరిత్రను తెలిపేలా సౌండ్ అండ్ లైట్ షోను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఈరోజు (జనవరి 24) ప్రారంభించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి, ఎంపీ విజయేంద్రప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.
Sound And Light Show At Golconda Fort : 11వ శతాబ్దం నాటి గోల్కొండలో ప్రస్తుత సౌండ్ అండ్ లైట్ షోను 1993లో ఏర్పాటు చేశారు. 30 సంవత్సరాల క్రితం నాటి పరిజ్ఞానం స్థానంలో సరికొత్తది ప్రవేశపెడుతున్నారు. ఈ షో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో 30 నిమిషాల 20 సెకన్ల సమయం ఉంటుంది. అంతర్జాతీయ హంగులతో గోల్కొండ చరిత్రను చూపించేలా 3డీ మ్యాపింగ్ ప్రొజెక్షన్, హై-రెజల్యూషన్ ప్రొజెక్టర్లు, లేజర్ లైట్లు, మూవింగ్ హెడ్స్ వంటి అధునాతన సాంకేతికతను ఇందులో ఉపయోగించారు.