వర్షంలో తడుస్తూ అమ్మాయి రీల్స్- సడెన్‌గా భారీ శబ్ధంతో పిడుగు- ఆ తర్వాత ఏమైదంటే? - Lightning struck while making reels
🎬 Watch Now: Feature Video
Published : Jun 27, 2024, 9:42 AM IST
Bihar Girl Survived Lightning Strikes making Reel : వర్షంలో రీల్స్ చేయడానికి వెళ్లిన 15 ఏళ్ల బాలికకు ఓ చేదు అనుభవం ఎదురైంది. వర్షంలో రీల్స్ చేస్తుండగా సమీపంలో పిడుగు పడిగింది. వెంటనే ఇంట్లోకి ఆమె పరుగెత్తింది. దీంతో త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బిహార్‌లోని సితామఢీ జిల్లాలో చాలా రోజుల తర్వాత బుధవారం వర్షం కురిసింది. ఈ క్రమంలోనే బేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని సిరసియా గ్రామానికి చెందిన సానియా కుమారి(15) పొరుగునే ఉన్న దేవనారాయమ్ భగత్ ఇంటి టెర్రస్ మీద రీల్స్ చేసేందుకు వెళ్లింది. డాబాపై మొబైల్‌ను ఒక చోట అమర్చి వర్షంలో రీల్ చేస్తుంది. ఈ క్రమంలో ఆకస్మాత్తుగా ఆ ఇంటి సమీపంలో భారీ శబ్దం, మెరుపులతో పిడుగు పడింది. సానియా ఒక్కసారిగా భయాందోళనకు గురై అక్కడి నుంచి పరుగులు పెట్టింది. అదృష్టవశాత్తూ పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. మరోవైపు ఉరుములు, మెరుపులు సమయంలో స్మార్ట్‌ఫోన్స్ వినియోగించడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.