సింహాద్రి అప్పన్నకు 27కిలోల వెండి వాకిలి- బహుకరించిన విశాఖ వాసి - సింహాద్రి అప్పన్నకు వెండి వాకిలి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 29, 2024, 1:34 PM IST
Gift of Silver Porch to Simhadri Appanna in Visaka District : సింహాద్రి అప్పన్నకు విశాఖకు చెందిన పువ్వాడ శేష మస్తాన్ రావు దంపతులు వెండి వాకిలి బహూకరించారు. 27.5 కేజీల వెండితో చేసిన వాకిలిని ఆలయ నిర్వాహక అధికారి ఎస్. శ్రీనివాసమూర్తి సమక్షంలో అందజేశారు. మస్తాన్ రావు దంపతులకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. సింహాద్రి అప్పన్న ఆలయ అధికారులు, అర్చకులు శ్రీనివాస్ ఆచార్యులు సమక్షంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.
వేద పండితులు సింహాద్రి అప్పన్నకు మస్తాన్ రావు దంపతులతో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం మస్తాన్రావు దంపతులిద్దరికి వేదాశ్వీరచనం చేశారు. స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శనం చేసుకొని వెండి వాకిలిని బహుకరించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. విశాఖ పట్టణానికి అతి సమీపంలో ఉన్న సింహాచల క్షేత్రంలో కొలవైన సింహాద్రి అప్పన్నను దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల్లోని భక్తులతో పాటు ఒడిషా రాష్ట్రానికి చెందిన వారు వస్తూ ఉంటారని ఆలయ అధికారులు తెలిపారు.