LIVE : జీహెచ్​ఎంసీ కౌన్సిల్​ సమావేశం - ప్రత్యక్షప్రసారం - GHMC Council Meeting Live - GHMC COUNCIL MEETING LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jul 6, 2024, 10:43 AM IST

Updated : Jul 6, 2024, 11:54 AM IST

GHMC Council Meeting Live : గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ తొమ్మిదో కౌన్సిల్​ సమావేశం నేడు జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండోసారి ఈ సమావేశం జరుగుతోంది. అధికార, విపక్ష కార్పొరేటర్ల మధ్య వాడివేడిగా చర్చ సాగుతోంది. మేయర్​తోపాటు డిప్యూటీ మేయర్​, మరికొంత మంది కార్పొరేటర్లు అధికార పార్టీలో చేరడంతో ఈసారి కౌన్సిల్​ భేటీ రసవత్తరంగా మారుతోంది. మేయర్​ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్​ శ్రీలత కాంగ్రెస్​లో చేరడంతో కాంగ్రెస్​ బలంగానే ఉంది. అలాగే బీఆర్​ఎస్​, బీజేపీలు తమ వాణిని బలంగా వినిపిస్తున్నాయి. సభలో ప్రస్తుతం 146 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వారిలో కాంగ్రెస్​కు 19 మంది, బీఆర్​ఎస్​కు 47 మంది, బీజేపీకి 39 మంది, ఎంఐఎంకు 41 మంది సభ్యుల బలం ఉంది. బీఆర్​ఎస్​ను వీడి కాంగ్రెస్​ కండువా కప్పుకున్న మేయర్​ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్​ శ్రీలత రాజీనామాల కోసం పట్టుబట్టాలని నిన్ననే గ్రేటర్​ హైదరాబాద్​ బీఆర్​ఎస్​ ప్రజాప్రతినిధులు నిర్ణయించారు.
Last Updated : Jul 6, 2024, 11:54 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.