గ్యాస్ పైప్లైన్ లీక్- భారీ మంటలతో భయాందోళనకు గురైన గ్రామస్థులు - Gas Pipe Line Leak At Eluru - GAS PIPE LINE LEAK AT ELURU
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 15, 2024, 7:50 PM IST
Gas Pipe Line Leak At Eluru: గ్యాస్ పైప్ లైన్ లీక్ అయ్యి భారీగా మంటలు ఎగిసిపడిన ఘటన ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెనుమల్లిలో చోటు చేసుకుంది. గతంలో పెరికెగూడెం నుంచి డోకిపర్రు ప్రధాన రహదారి వరకు మెయిల్ సంస్థ గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చేసింది. కేవలం 2 అడుగుల లోతులో అధికారులు పైపు లైను ఏర్పాటు చేశారు.
Penumalli Fires Blow Up Due To Gas Leakage: ఈరోజు ఉదయం ప్రధాన రహదారి వెంబడి గ్యాస్ లీకవుతున్న సమయంలో రహదారి పక్కనే వేసిన చెత్తకు నిప్పంటించారు. ప్రధాన రహదారి వెంబడి లీకవడం సమీపంలో వేసిన చెత్తకు నిప్పు అంటుకోవడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయని స్థానికులు తెలిపారు. పెద్ద ఎత్తున పొగ వ్యాపించడంతో ఇరువైపులా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కైకలూరు అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో ప్రమాదం తప్పింది. అధికారులు సకాలంలో స్పందించటంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.