ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలకు రేపటి ఫలితాలతో మోక్షం: గంటా శ్రీనివాసరావు - Ganta Comments on Election Result - GANTA COMMENTS ON ELECTION RESULT
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-06-2024/640-480-21624841-thumbnail-16x9-ganta-srinivasa-rao-comments-on-election-results.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 3, 2024, 4:29 PM IST
Ganta Srinivasa Rao Comments on Election Results : ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలకు రేపటి ఫలితాలతో మోక్షం లభించబోతుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలో కనకమహాలక్ష్మి అమ్మవారిని గంటా శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మించి రేపు కూటమి ఘన విజయం సాధించబోతుందన్నారు. కౌంటింగ్ సమయంలో అల్లర్లు సృష్టించేలా సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని విమర్శించారు.
"ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఫలితం రేపు రాబోతోంది. త్వరగా ఈ ప్రభుత్వాన్ని తరిమేయాలనే కసి ప్రజల్లో కనిపించింది. ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ ఏకపక్షంగా కూటమిదే విజయం అని చెప్పాయి. ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా బస్సులు, రైళ్లలో వచ్చారు. అత్యధిక పోలింగ్ శాతం నమోదు కావడం ప్రజల నాడికి సంకేతం. ఎగ్జిట్ పోల్స్‌కు మించి కూటమి ఘన విజయం సాధించబోతోంది. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి పునర్వైభవం రాబోతోంది. విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో క్లీన్ స్వీప్ చేస్తున్నాం. అల్లర్లు సృష్టించే వాళ్లెవరో ప్రజలకు తెలుసు. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదు. భీమిలితో పాటు రాష్ట్రంలోనూ గెలుపు కూటమిదే" అని గంటా ధీమా వ్యక్తం చేశారు.