నందిగామలో కరెన్సీ వినాయకుడు - 2.7 కోట్లతో మండపం ముస్తాబు - GANESH WITH CURRENCY

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 13, 2024, 5:48 PM IST

thumbnail
నందిగామలో కరెన్సీ వినాయకుడు (ETV Bharat)

Ganesh With Rs. 2.7 Crore Currency Notes: వినాయక చవితి అంటేనే ఊరూవాడ పండుగ. ప్రతి వీధిలో ఎంతో ఉత్సాహంగా వినాయకుడి మండపాలు ఏర్పాటు చేస్తుంటారు. అంతేకాదు తమ మండపానికి అందరూ విచ్చేసేలా అందరికంటే భిన్నంగా ముస్తాబు చేసేందుకు ప్రతి ఒక్కరూ పోటీ పడుతుంటారు. అందులో భాగంగానే కొత్తకొత్త ఆలోచనలు చేస్తుంటారు. ఇలాంటిదే ఎన్టీఆర్ జిల్లా నందిగామ వాసవి మార్కెట్లో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపం. 2 కోట్ల 70 లక్షల రూపాయల కరెన్సీతో ఈ మండపాన్ని అలంకరించారు. ఇప్పుడీ మండపం అబ్బురపరుస్తోంది. 

నందిగామలోని వాసవి బజార్​లో 42వ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజా దర్బార్ గణపతిని ఏర్పాటు చేసి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నాడు 2 కోట్ల 70 లక్షల రూపాయలతో వినాయకుని అందంగా అలంకరించారు. కమిటీ వారు ఏర్పాటు చేసిన ఈ కరెన్సీ వినాయకుడిని సందర్శించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.