రామోజీరావు మృతికి సంతాపంగా ఆదివారం షూటింగ్​ బంద్​ - Gamechanger Team pays tribute to Ramoji Rao - GAMECHANGER TEAM PAYS TRIBUTE TO RAMOJI RAO

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jun 8, 2024, 10:56 PM IST

Gamechanger Team pays tribute to Ramoji Rao : రామోజీరావు మరణవార్తను తెలుసుకుని ఆంధ్రప్రదేశ్​లోని రాజమండ్రిలో రామ్​చరణ్​ హీరోగా నటిస్తున్న గేమ్‌ఛేంజర్‌ చిత్రయూనిట్‌ నివాళులు అర్పించింది. హీరో రామ్‌చరణ్, దర్శకుడు శంకర్ షూటింగ్ నిలిపివేసి అంజలి ఘటించారు. నితిన్‌ హీరోగా నటిస్తున్న రాబిన్‌హుడ్‌ చిత్రబృందం, శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న చిత్రయూనిట్‌ మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ చిత్ర బృందాలు చిత్రరంగానికి రామోజీరావు చేసిన సేవలను స్మరించుకున్నాయి. 

Mahesh Babu pays tribute to Ramoji Rao : రామోజీరావు అస్తమయం పట్ల ఎక్స్‌ వేదికగా హీరో మహేశ్‌బాబు సంతాపం తెలిపారు. సినిమాపై రామోజీరావు అభిరుచికి రామోజీ ఫిల్మ్‌సిటీ నిదర్శనమన్నారు. రామోజీరావు అంటే వ్యక్తి కాదు వ్యవస్థ అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తాను విదేశాల్లో ఉండగా ఈ దుర్వార్త రావడం విచారకరమన్న అరవింద్‌ తెలిపారు. ఎన్నో విషయాల్లో రామోజీరావు తనకు స్ఫూర్తిదాయమన్నారు. రామోజీరావుకు తెలుగు ఫిల్మ్‌ టీవీ ఫెడరేషన్‌ వెల్ఫేర్‌ ఫోరం నివాళులు అర్పించింది. ఆయనకు సంతాపంగా ఆదివారం ఒక్కరోజు సీరియల్‌ షూటింగ్‌లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.