2 కోట్ల పెట్టుబడితో 100 కోట్ల టర్నోవర్ - లక్షల్లో జీతం వదిలేసి కోట్లు సంపాదిస్తున్న యువతి - Freyr Energy Founder Interview
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-03-2024/640-480-20917149-thumbnail-16x9-yuva-story.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Mar 6, 2024, 11:30 AM IST
Freyr Energy Founder Radhika Choudhary Interview : విదేశాల్లో ఉన్నత చదువులు అక్కడే పెద్ద సంస్థలో ఉద్యోగం నెలకు లక్షల్లో వేతనం ఇవన్నీ వదిలి రావాలంటే ఎవరైనా సరే కాస్త వెనకా ముందూ ఆలోచిస్తారు. కానీ రాధిక చౌదరి మాత్రం భిన్నంగా ఆలోచించారు. ఎవరి దగ్గరో ఉద్యోగం చేయటంకంటే తానే నలుగురికి ఉపాధి కల్పించే స్థితిలో ఉండాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఉద్యోగానికి రాజీనామా చేసి కోఫౌండర్ సౌరభ్‌తో కలిసి ఫ్రెయర్ ఎనర్జీ అంకురాన్ని స్థాపించారు.
2 కోట్ల పెట్టుబడి, నలుగురు ఉద్యోగులతో ప్రారంభమైన ఫ్రెయర్ ఎనర్జీ (Freyr Energy) అంకుర సంస్థ నేడు 280 మంది ఉద్యోగులతో 26కు పైగా రాష్ట్రాల్లో సేవలందిస్తూ విజయ పథంలో దూసుకుపోతోంది. వేలాది ఇళ్లను సౌర విద్యుత్ గృహాలుగా మార్చుతున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సేవలందిస్తున్న ఈ సంస్థ త్వరలో 100 కోట్ల టర్నోవర్ కు చేరుకోనుంది. మరి ఇంతటి భారీ విజయాన్ని సాధించాడానికి వాళ్లు పడ్డ కష్టమేంటో ఫ్రెయర్ ఎనర్జీ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన రాధిక చౌదరినే అడిగి తెలుసుకుందాం.