LIVE : దిల్లీలో నాలుగో విడత క్రిటికల్ మినరల్ బ్లాక్స్ వేలం - Mineral Blocks Auction Program LIVE

By ETV Bharat Telangana Team

Published : Jun 24, 2024, 4:14 PM IST

Updated : Jun 24, 2024, 4:28 PM IST

thumbnail

Fourth Phase Critical Mineral Blocks Auction Program LIVE : కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా, నాలుగో విడత క్రిటికల్ మినరల్ బ్లాక్స్ వేలం కార్యక్రమం దిల్లీలోని సీజీవో కాంప్లెక్స్ లో జరుగుతుంది. ఇప్పటి వరకు ఒక్కో నగరంలో బొగ్గు గనుల వేలం నిర్వహిస్తూ వచ్చిన కేంద్రం, ఈసారి దిల్లీలో నిర్వహిస్తుంది. దేశ రాజధానిలో నాల్గో విడత ఖనిజాల వేలం పాటు జరుగుతోంది. దీన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్​ రెడ్డి ప్రారంభించగా, ఇప్పుడు వేలం కొనసాగుతోంది. ఇప్పటికే జరిగిన బొగ్గు గనుల వేలం నిర్వహణలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొని, సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని కేంద్రానికి భట్టి విజ్ఞప్తి చేశారు. వేలానికి పెట్టిన గనుల్లో సింగరేణి సమీపంలోని శ్రావణపల్లి బొగ్గు గని కూడా ఉంది. అక్కడ 11.99 కోట్ల టన్నుల బొగ్గు గనుల నిల్వలున్నట్లు భూగర్భ సర్వేలో తేలింది. 

Last Updated : Jun 24, 2024, 4:28 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.