హైవేపై వరుసగా ఢీకొన్న కార్లు- ప్రయాణికులు సేఫ్ - Road Accident in NTR District - ROAD ACCIDENT IN NTR DISTRICT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 15, 2024, 1:29 PM IST
Road Accident in NTR District: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు నేషనల్ హైవేలో ఒకదాని వెనుక మరొకటిగా నాలుగు వాహనాలు ఢీకొన్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వేగంగా వెళ్తున్న నాలుగు వాహనాలలో ముందున్న కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. రోడ్డు ప్రమాదం సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం ఏఎస్ఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Palnadu Road Accident: మరోవైపు పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట మండలం ఈవూరివారిపాలెం-పసుమర్రు గ్రామాల మధ్య ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టిప్పర్ను ఢీకొంది. దీంతో మంటలు చెలరేగి, గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు కళ్లు తెరిచి ఏం జరుగుతుందో చూసే లోపే అగ్నికీలలకు ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరో పదిమంది తీవ్ర గాయాలపాలవ్వటంతో సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.