వాగులో కొట్టుకుపోయిన బైక్- ప్రాణాలతో బయటపడిన నలుగురు యువకులు - Four Youths Escaped Safely - FOUR YOUTHS ESCAPED SAFELY

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2024, 6:37 PM IST

Four People Was Safe in Washed Away With Bike in Flood : వాగు ఉద్ధృతికి ద్విచక్ర వాహనంతో పాటు నలుగురు వ్యక్తులు కొట్టుకుపోయి సురక్షితంగా బయటపడిన ఘటన అల్లూరి జిల్లాలో చోటు చేసుకుంది. ముంచంగిపుట్టు మండలం బిరిగుడ వాగును దాటేందుకు బైక్​ను మోసుకుని నలుగురు యువకులు వెళ్తుండగా నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. నలుగురు యువకులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. నీటిలో కొట్టుకుపోయిన ద్విచక్ర వాహనం కోసం గాలిస్తున్నారు. వంతెన లేకపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు.  

ఇటీవల బైక్​పై వంతెన దాటేందుకు ఇద్దరు యువకులు సాహసం చేశారు. దీంతో నీటి ఉద్ధృతికి బైక్ జారిపోవడంతో ప్రమాదంలో చిక్కుకున్నారు. వెంటనే అక్కడ ఉన్న స్థానికులు గమనించి పరుగున అక్కడికి వచ్చి బైక్​తో పాటు ఇద్దరినీ కాపాడారు. స్థానికులు లేనట్లయితే యువకులు బైక్​తో పాటు వాగు ప్రవాహనికి కొట్టుకుపోయేవారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సరైన రహదారి సదుపాయం, వంతెనలు లేక గిరిజనులకు ఇబ్బందులు తప్పడం లేదు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.