వైసీపీ ఘోర ఓటమికి పార్టీ నిర్ణయాలే కారణం- సంచలన ఆరోపణలు చేసిన కాటసాని - Katasani Rambhupal Reddy comments on YCP - KATASANI RAMBHUPAL REDDY COMMENTS ON YCP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 9, 2024, 9:23 PM IST
Former Panyam MLA Katasani Rambhupal Reddy Press Meet : ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘోర పరాజయానికి పార్టీ తీసుకున్న నిర్ణయాలే కారణమని పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసిన ఓటమి చెందడం చాలా బాధాకరమని అన్నారు. కర్నూలులోని స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ ఓటమికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ముఖ్య కారణమని వెల్లడించారు. ఈ చట్టం తీసుకురావడానికి ముందు ఎమ్మెల్యేల సూచనలను జగన్మోహన్ రెడ్డి తీసుకోలేదని విమర్శించారు. ఈ చట్టాన్ని ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆపాలని ఎన్ని సార్లు చెప్పిన ముఖ్యనాయకులు, అధికారులు పట్టించుకోలనేదని కాటసాని రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు.
అలాగే ఇసుక, మద్యం విధానాల వల్ల కూడా పార్టీ ఓడిపోవడానికి కారణం అయ్యాయని తెలిపారు. ఇసుక పాలసీ వల్ల ఎంతో మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వివరించారు. రాజకీయాలలో గెలుపు ఓటములు సర్వసధారణమే అన్నారు. ప్రజా తీర్పును అందరూ గౌరవించాలని తెలిపారు. నాయకులు ఎవరు అధైర్యపడకుడదని అందరికీ అండగా ఉంటానని వివరించారు. అలాగే పోలీసులు ఒక పార్టీకి కొమ్ముకాయకుండా అందరికి సహకారించాలని కాటసాని రాంభూపాల్ రెడ్డి కోరారు.