కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణ బాబు కన్నుమూత - Pendyala Venkata Krishnarao - PENDYALA VENKATA KRISHNARAO

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 22, 2024, 11:32 AM IST

Former Kovvur MLA Pendyala Venkata Krishnarao Passed Away : తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల వెంకట కృష్ణారావు (71) మృతి చెందారు. అనారోగ్యం కారణంగా కొంతకాలంగా హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సీనియర్​ ఎన్టీఆర్​ టీడీపీని స్థాపించాక రాజకీయాల్లోకి వచ్చిన కృష్ణబాబు 1983 లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 1985, 1989, 1994, 2004 ఎన్నికల్లో టీడీపీ నుంచే గెలిచారు. 1999 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. 

2012లో వైఎస్సార్సీపీలో చేరిన కృష్ణారావు 2014, 2019 ఎన్నికల్లో ప్రచారానికే పరిమితం అయ్యారు. ఆ తర్వాత పార్టీలో ఉన్నా విశ్రాంత జీవనం గడుపుతున్నారు. ఆయన భార్య అన్నపూర్ణ కొంతకాలం క్రితం మృతిచెందారు. ఆయనకు ముగ్గురు సంతానం. ఇద్దరూ కుమారులు, ఒక కుమార్తె. ఆయన అల్లుడు ఎస్. రాజీవ్ కృష్ణ రాష్ట్ర ప్రభుత్వ సలహా దారుగా, కొవ్వూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ పరిశీలకునిగా కొనసాగుతున్నారు. ఆయన మృత దేహాన్ని మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి కొవ్వూరు నియోజకవర్గంలోని ఆయన స్వగ్రామం దొమ్మేరు తీసుకొచ్చారు. బుధవారం అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుమారులు తెలియజేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.