YUVA : వైద్యవిద్య కోసం విదేశాలకు వెళ్తున్నారా? ఐతే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! - Foreign Medical Education Tips
🎬 Watch Now: Feature Video
Published : Aug 3, 2024, 4:37 PM IST
Foreign Countries Medical Education Tips : వైద్య విద్య చదవాలని ఎంతో మంది కలలు కంటారు. అయితే ఆర్థిక ఇబ్బందులో, నీట్‌లో సీటురాకనో ఎంబీబీఎస్ చదివేందుకు విదేశాలకు క్యూ కడుతున్నారు. మరి చాలా మంది విద్యార్థులు అక్కడ వైద్యులుగా స్థిరపడలేక, భారత్‌కు వచ్చి ఎన్ఎమ్సీ పెట్టే పరీక్షల్లో పాస్ కాలేక నానాఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విదేశాల్లో వైద్యవిద్య చదువుకోవాలనుకునే వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జమైకాలాంటి దేశంలో భారతీయ విద్యార్థులకు ఉన్న అవకాశాలు ఏంటి? అనే అంశాలను బీమ్స్ విద్య సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ గుణ ముప్పూరి వివరిస్తున్నారు.
అక్కడ ఎంబీబీఎస్ పూర్తి చేసిన, తిరిగి భారత్‌లో ఉన్నత విద్య అభ్యసించాలి అన్నా, ప్రాక్టీస్ చేయాలన్నా ఎన్ఎమ్సీ పెట్టే పరీక్షల్లో పాస్ కావాల్సి ఉంటుందంటున్నారు. పోనీ అక్కడే ఉండి ప్రాక్టీస్ చేద్దామా అంటే వీసా సమస్యలు అనేకం. ఈ నేపథ్యంలో విదేశాల్లో వైద్య విద్య చదివేందుకు ఉన్న అవకాశాలు, ఇబ్బందులు, ముఖ్యంగా జమైకాలో భారతీయ విద్యార్థులకు ఉన్న అవకాశాలపై జమైకాలో బీఐఎంఎస్ (బీమ్స్) విద్య సంస్థ నిర్వహిస్తున్న డాక్టర్ గుణ ముప్పూరితో ఈటీవీ భారత్ ముఖాముఖి.