యోగి వేమన యూనివర్సిటీలో ఫుడ్‌ పాయిజన్‌ - 50 మంది విద్యార్థినులకు అస్వస్థత - Food Poison Yogi Vemana University

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 1:39 PM IST

Food Poison for Students in Yogi Vemana University: కడప యోగి వేమన విశ్వవిద్యాలయంలోని వసతి గృహంలో ఫుడ్‌ పాయిజన్ వల్ల విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. 50 మందిని ఆస్పత్రికి తరలించారు. వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరో 30 మందికి కడప ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. గత మూడు రోజుల నుంచి వసతి గృహంలో భోజనాలు సరిగా లేవని విద్యార్థినులు ప్రిన్సిపాల్​కు, వసతి గృహ నిర్వాహకులకు తెలియజేశారు. 

అయినప్పటికీ వారు స్పందించలేదు. బుధవారం రాత్రి వంకాయ కూర, రసం తినడంతో ఒక్కసారిగా విద్యార్థినులకు వాంతులు విరేచనాలయ్యాయి. వారందరినీ రాత్రికిరాత్రే ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని యోగి వేమన ఉపకులపతి, వసతి గృహ నిర్వాహకులు గోప్యంగా ఉంచారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు సరిగా ఊపిరి తీసుకోలేకపోతున్నారని అక్కడున్న వైద్యులు తెలిపారు. అందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. విద్యార్థినులకు ఏదైనా జరగరానిది జరిగితే దానికి పూర్తి బాధ్యత యోగి వేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి వహించాల్సి వస్తుందని విద్యార్థి సంఘ నాయకులు హెచ్చరించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.