వరద బాధితులకు కూటమి ప్రభుత్వం అండ- ముమ్మరంగా నిత్యవసర సరుకుల పంపిణీ - Flood Relief Work Speed Up - FLOOD RELIEF WORK SPEED UP

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 6, 2024, 4:06 PM IST

Essential Items Distribution to People in Flood Affected Areas : వరద బాధితులకు సాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆరు రకాల నిత్యావసర వస్తువులను వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలకు పంపిణీ చేస్తోంది. రేషన్ పంపిణీ చేసే వెయ్యి వాహనాల్లోనే ముంపు ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు అందిస్తున్నారు. 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పంచదార, లీటర్​ పామాయిల్​, రెండు కిలోల ఉల్లిగడ్డ, ఆలుగడ్డ అందిస్తున్నారు. వరదలు తగ్గిన ప్రాంతాల్లో ఇవి పంచే ఏర్పాట్లు చేశారు. ఇంకా ముంపులో ఉన్న ప్రాంతాల్లో ఆహారం, పండ్లు సరఫరా చేస్తున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఉదయం నుంచి వరద ముంపు ప్రాంతాల్లో నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ్టి నుంచి సబ్సిడీ ధరలతో కూరగాయల విక్రయాలు ప్రారంభమయ్యాయి. దీనిపై పూర్తి వివరాలు ఈ టీవీ ప్రతినిధి అందిస్తారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.