రెయిన్ ఎఫెక్ట్ - ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వైరా జలాశయం - Flood Effect on Khammam District - FLOOD EFFECT ON KHAMMAM DISTRICT
🎬 Watch Now: Feature Video
Published : Sep 8, 2024, 7:37 PM IST
Flood Water Flows Into Wyra Project : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వైరా జలాశయానికి వరద ఉద్ధృతి అధికంగా ఉండటంతో 20 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం దాటింది. జలాశయం అలుగుల ద్వారా దిగువకు భారీగా వరద ప్రవహించడంతో వైరా నది పరివాహక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
కొనిజర్ల మండలం పల్లిపాడు నుంచి కొత్తగూడెం వెళ్లే రహదారిలో పగిడేరు ఉగ్రరూపం దాల్చడంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. జూలూరుపాడు మండలంలో బేతాలపాడు, చింతల తాండతో పాటు పలు గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వైరా పురపాలకసంఘం పరిధిలోని సత్రం బజార్, ఇందిరమ్మ కాలనీలలో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. ఏనుకూరు తల్లాడ మండలాల్లో వరద తాకిడికి పంట పొలాలు నీట మునిగాయి. పొలాలకు వెళ్లే దారులు వరదతో పోటెత్తడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.