గోదావరిలోకి దూకిన మహిళను రక్షించిన జాలర్లు - వైరల్​గా మారిన వీడియో - Fishermen Rescued Rajahmundry Woman - FISHERMEN RESCUED RAJAHMUNDRY WOMAN

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 28, 2024, 11:00 PM IST

Fishermen Rescued Rajahmundry Woman :  నేటి కాలంలో చిన్నపాటి కారణాలతో, క్షణికావేశంలో చాలా మంది బలవన్మరణాలను పాల్పడుతున్నారు. చిన్న అపజయాన్నీ తట్టుకోలేకపోతున్నారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వచ్చాయని, ఆర్థిక ఇబ్బందులు,  కుటుంబంలో సమస్యలను తట్టుకోలేక చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. కారణం ఏదైనా విలువైన జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఫలితంగా అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలతో తమను నమ్ముకున్న వారిని విషాదంలోకి నెట్టేస్తున్నారు.

A Woman Attempt Suicide in Godavari River at Rajahmundry : తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కానీ సకాలంతో పోలీసులు స్పందించడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాజమండ్రి చెందిన ఓ వివాహిత కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే గోదావరి నదిలోకి దూకింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడ ఉన్న జాలర్ల సహాయంతో ఆమెను రక్షించి, రెండో పట్టణ పోలీస్​స్టేషన్​కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఆ మహిళను వారి బంధువులకు అప్పగించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.