తొలి ఎయిర్ స్క్వాడ్రన్‌కు కమాండింగ్ ఆఫీసర్ మన హైదరాబాదీనే - Captain Abhishek Ram Interview - CAPTAIN ABHISHEK RAM INTERVIEW
🎬 Watch Now: Feature Video
Published : Apr 10, 2024, 9:18 AM IST
First Commanding Officer of MH 60R Seahawk Helicopter Captain Abhishek Ram : చిన్నతనం నుంచే మామయ్య స్ఫూర్తితో ఆర్మీ స్కూల్లో చదివాడు ఈ హైదరాబాదీ. పక్కా ప్రణాళికతో భారత నౌకాదళంలో అత్యున్నత స్థాయికి చేరాడు. అనతికాలంలోనే భారత నౌకాదళంలో టెస్టింగ్ పైలెట్ స్థాయికి చేరుకున్నాడు. ఇటీవలే అత్యంత శక్తిమంతమైన తొలి ఎయిర్ స్క్వాడ్రన్ నడిపే అద్భుత అవకాశం అందుకున్నాడు. సముద్ర లోతుల్లో దాగి ఉన్న శత్రు జలాంతర్గాములను క్షణాల్లోనే మట్టుబెట్టే ఎంహెచ్ 60ఆర్(MH 60R) సీహాక్ హెలికాప్టర్‌కు మొదటి కమాండింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించాడు.
మిగిలిన హెలికాప్టర్ల కన్నా ఎందుకు ఈ ఎంహెచ్ 60ఆర్ ప్రత్యేకమో చెప్పారు. తొలిసారి ఈ సీహాక్ హెలికాప్టర్ నడిపినప్పుడు పైలెట్‌గా తన అనుభవాలను గురించి వివరించారు. నేవీలో చేరాలనుకునే యువతకు అతను మంచిని సందేహాన్ని ఇచ్చారు. నేవీలో అవకాశం వస్తే అస్సలు వదులుకోవద్దని హితవు పలికారు. అతనే కెప్టెన్ అభిషేక్ రామ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. అతను పైలట్‌గా ఎదుర్కొన్న సవాళ్లను అతను మాటల్లోనే తెలుసుకుందాం.