విద్యుత్ వైర్లు తగిలి లారీ దగ్ధం- అప్రమత్తమైన డ్రైవర్ - Fire Accident in Lorry in Kurnool - FIRE ACCIDENT IN LORRY IN KURNOOL
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 30, 2024, 1:04 PM IST
Fire Accident in Lorry in Kurnool District : కర్నూలు జిల్లా ఆదోని బైపాస్ నిర్మాణ పనుల్లో పెను ప్రమాదం తప్పింది. ఉదయం ధనపురం నుంచి ఆదోని బైపాస్ రాహదారి నిర్మాణానికి మట్టిని తరలిస్తుండగా అకస్మాత్తుగా టిప్పర్‌కు విద్యుత్ వైర్లు (Electric Wires) తగిలి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ (Driver) వెంటనే టిప్పర్ నుంచి దూకి ప్రాణాలతో బయట పడ్డాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది (Fire fighters) ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. ఈ ఘటనతో డ్రైవర్ భయాందోళనకు గురయ్యాడు.
Lorry Fire Accident Due to Electric Wires at Adoni : రాష్ట్రంలో రోజు రోజుకు ఇటువంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇటీవలె ఎన్టీఆర్ జిల్లా (NTR District) మైలవరం మండలం వెల్వడంలో విద్యుత్తు తీగలు లారీ ట్రక్కుకు తగిలి విద్యుదాఘాతంతో డ్రైవర్ మృతి చెందిన ఘటన జరిగింది. ఈ ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది.