కోదాడ జూనియర్ సివిల్ కోర్టులో అగ్ని ప్రమాదం - బీరువాలోని కీలక దస్త్రాలు దగ్ధం - KODADA CIVIL COURT FIRE ACCIDENT
🎬 Watch Now: Feature Video
Fire Accident In Kodada Civil Court : కోదాడ జూనియర్ సివిల్ కోర్టులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా కోర్టులోని పలు ముఖ్యమైన రికార్డులు కాలి బూడిదయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న న్యాయమూర్తులు ఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ ఘటనలో పలు కీలక దస్త్రాలు కాలి బూడిదైనట్లు చెప్పారు.
రాష్ట్రంలో తరచూ ఎక్కడో ఓ చోట అగ్నిప్రమాదాలు జరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్త్తోంది. తాజాగా సూర్యాపేట జిల్లా కోదాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. న్యాయస్థానానికి మూడు రోజులు సెలవు కావడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూటేనని తేలింది.
న్యాయమూర్తి గదిలోని ఓ ఎలక్ట్రిక్ బోర్డు నుంచి మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న బీరువాకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో బీరువాలోని కొన్ని పత్రాలు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే న్యాయమూర్తులు శ్యాం సుందర్, భవ్య విద్యుత్, పోలీసుశాఖ అధికారులతో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టాల్సిందిగా పోలీసులను న్యాయమూర్తులు కోరారు.