షాపింగ్ మాల్లో చెలరేగిన మంటలు - అగ్నిమాపక సిబ్బందికి అస్వస్థత - అగ్నిప్రమాద వార్తలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 29, 2024, 12:29 PM IST
Fire Accident In Kadapa District: వైఎస్సార్ కడప జిల్లాలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ షాపింగ్ మాల్లో జరిగిన ఈ ప్రమాదంలో ప్రాణ నష్టమేమి సంభవించకపోగా, మంటాలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఆకృతి షాపింగ్ మాల్లో సోమవారం ఉదయం మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు.
షాపింగ్ మాల్లోని రెండో అంతస్థులో మంటలు చెలరేగడంతో, ఆ ప్రాంతం దట్టమైన పొగతో నిండిపోయింది. రెండో అంతస్థులో పొగ నిండిపోవడంతో బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో షాపింగ్‌మాల్ అద్దాలను ధ్వంసం చేసి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. పొగ అధికంగా ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది సాంబశివా రెడ్డి అస్వస్థకు గుర్యయారు. వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.