thumbnail

నగరంలో వరుసగా రెండు అగ్ని ప్రమాదాలు - భయంతో స్థానికుల ఉరుకులు పరుగులు - Fire Accident In Hyderabad

By ETV Bharat Telangana Team

Published : Apr 1, 2024, 9:45 AM IST

Fire Accident In Hyderabad : హైదరాబాద్​లో వరుసగా రెండు అగ్నిప్రమాదాలు చోటు చేసుకోవడం కలకలం రేపింది. అత్తాపూర్​లో అట్టపెట్టల గోదాంలో ఆదివారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. గోదాంలో అట్టపెట్టెలకు మంటలు అంటుకున్నాయి. స్థానికంగా దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు ఊపిరి కూడా పీల్చలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. అట్టపెట్టల గోదాం కావడంతో మంటలు అదుపులోకి రావడానికి దాదాపు రెండు గంటల సమయం పట్టింది.

Huge Fire Accident In Scrap Godown In Attapur : ప్రమాదం జరిగిన సమయంలో గోదాంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. విద్యుద్ఘాతం కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు. మరోవైపు చార్మినార్‌ యూనాని ఆసుపత్రి సమీపంలో విద్యుత్‌ స్తంభానికి మంటలు అంటుకున్నాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళన చెంది, ఉరుకులు పరుగులు పెట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.