ఓయో హోటల్‌లో అగ్నిప్రమాదం - ఇద్దరికి అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు - Fire Accident AT OYO Hotel - FIRE ACCIDENT AT OYO HOTEL
🎬 Watch Now: Feature Video
Published : May 3, 2024, 1:00 PM IST
Fire Accident AT OYO Hotel : హైదరాబాద్ చైతన్యపురిలోని మోహన్‌నగర్ వద్ద ఉన్న ఓయో హోటల్‌లో ఈరోజు తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హోటల్‌లో చిక్కుకున్న 8 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు.
మరో ఇద్దరు అస్వస్థతకు గురవ్వగా వారిని మెరుగైన వైద్య సేవల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మూడు శకటాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో ఏదో ఒక చోట అగ్నిప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. అగ్నిప్రమాదాలను నివారించేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇటీవలే అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ప్రమాదాల నివారణపై ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.