కృష్ణా నదిలో బుసుక, ఇసుక తరలింపు - రెండు గ్రామాల మధ్య పోరు - అక్రమ ఇసుక రవాణా
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 6, 2024, 9:24 AM IST
Fight Between Two Villages : కృష్ణా నదిలో బుసుక, ఇసుక తరలింపును అడ్డుకోవడంతో రెండు గ్రామాల మధ్య ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గత 3 రోజులుగా కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పాగోలుకు చెందిన జగనన్న లే అవుట్లకు నడకుదురు నుంచి టిప్పర్లతో ఇసుక, బుసుక తరలిస్తున్నారు. అనుమతులు లేకుండా కృష్ణా నదిలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్లను నడకుదురు గ్రామస్థులు అడ్డుకున్నారు. బుసక తవ్వకాలు వల్ల తమ పంట పొలాలు పాడైపోతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ బుసక తవ్వకాలకు బ్రేక్ పడింది. మరలా సోమవారం పాగోలు చెందిన కొందరు నడకుదురు ఇసుకు రేవుకు వెళ్లి బుసుక, ఇసుక తరలిస్తుండగా విషయం తెలిసి నడకుదురు గ్రామస్తులు, రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని తవ్వకాలను అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతగా మారింది.
Sand Transport in Krishna District : సమాచారం అందుకున్న చల్లపల్లి తహసీల్దార్ బి.సుమతి, ఘంటసాల ఎస్సై ప్రతాపరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాల వారి వాదనలు విన్నారు. ఈ ప్రాంతం సీఆర్‌జడ్ పరిధిలో ఉండటం వల్ల ఇక్కడ బుసక తవ్వకాలు నిషేధించారని తహసీల్దారుకు వివరించారు. తమకు తవ్వకాలు చేపట్టేందుకు అనుమతులు ఉన్నాయని పాడేరు గ్రామస్థులు తెలపటంతో సంబంధిత పత్రాలు తీసుకుని ఇరువురు కార్యాలయానికి రావాలని ఆదేశించారు. దీంతో వివాదం సద్దుమనిగింది.