బాలినేని ఎన్నికల ప్రచారంలో వాలంటీర్ - ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలపై దాడి - Fight Between TDP And YSRCP - FIGHT BETWEEN TDP AND YSRCP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 10, 2024, 10:46 PM IST
Fight Between TDP And YSRCP : ప్రకాశం జిల్లా ఒంగోలు సమతానగర్‌లో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం ఉద్రిక్తతకు దారి తీసింది. సమతా నగర్ ఒకటవ లైన్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి, అతని కోడలు కావ్య నిర్వహిస్తున్న ఎన్నికల్లో ప్రచారంలో ఓ వాలంటీర్ పాల్గొన్నారు. అపార్ట్‌మెంట్‌లో అందరూ తెలుగుదేశం పార్టీ అభిమానులే ఉన్నారని ఇక్కడికి వచ్చి ప్రచారం చేసి ఇబ్బంది పెట్టొద్దని అధికార పార్టీ కార్యకర్తలను కోరారు. ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్ని కళావతి అనే మహిళ ప్రశ్నించింది.
War in Election Campaign at Ongole : దీంతో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయి కళావతికి చెందిన కుటుంబ సభ్యులపై దాడికి దిగారు. ఈ దాడి జరిగిన విషయాన్ని తెలుగుదేశం నాయకులు తెలియడంతో కొంతమంది నాయకులు కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. ఇరువర్గాల మధ్య గొడవ మరింత తీవ్రమైంది. టీడీపీ నాయకుడు మోహన్రావు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం అభ్యర్థి దామచర్ల జనార్ధన సమతా నగర్ చేరుకున్నారు. రెండు వైపులా నుంచి పెద్ద స్థాయిలో కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా పోలీసులు చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.