అనధికార కరెంటు కోతలు- ఆందోళనకు దిగిన అన్నదాతలు - విద్యుత్ అధికారుల తీరు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 17, 2024, 1:28 PM IST

Farmers Protest Power Interruption in Satyasai District : విద్యుత్ అధికారుల తీరును నిరసిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల ఉపకేంద్రం ఎదుట రైతులు నిరసన ప్రదర్శన చేపట్టారు. అనధికారిక కోతలు (Informal Cuts), లో వోల్టేజీ (Low Voltage) కారణంగా పంటలు ఎండిపోతున్నాయని  అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బందిచే విద్యుత్ సరఫరాను నిలిపివేయించి ఉప కేంద్రంలో ఆందోళనకు దిగారు. సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించటంలేదని వాపోయారు. రైతుల (Farmers) పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవాని డిమాండ్ (Demond) చేశారు. రాకపోకలకు అంతరాయం కలుగుతుందంటూ ఎస్సై దిలీప్‌కుమార్ రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు.
విద్యుత్ కోతలపై రైతులతో చర్చించేందుకు సాయంత్రం సమావేశం ఏర్పాటు చేస్తామన్నా విద్యుత్ అధికారులు (Electricity authorities) ప ట్టించుకోలేదు. విద్యుత్ అధికారుల తీరును నిరసిస్తూ పెద్ద సంఖ్యలో రైతులు ఉపకేంద్రానికి చేరుకున్నారు. సిబ్బందిచే విద్యుత్ సరఫరాను నిలిపివేయించి, ఉప కేంద్రంలో ఆందోళనకు దిగారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.