రోడ్డెక్కిన గ్రీన్ ఫీల్డ్ హైవే భూనిర్వాసిత రైతులు - మద్దతు తెలిపిన టీడీపీ నేతలు - గ్రీన్ ఫీల్డ్ హైవే అండర్ పాస్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 5, 2024, 5:44 PM IST
Farmers Protest About Greenfield Highway Project in Eluru District : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని గ్రీన్ ఫీల్డ్ హైవే అండర్ పాస్ పనులను రైతులు అడ్డుకొని ధర్నా నిర్వహించారు. గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ, రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. న్యాయమైన పరిహారం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఆర్బిట్రేషన్ జడ్జిమెంట్స్ అమలు చేసి రైతులకు న్యాయమైన పరిహారం అందించాలని రైతుసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులు తమకు న్యాయమైన పరిహారం ఇవ్వాలంటూ ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.
రైతులకు తక్కువ పరిహారం ఇచ్చి బలవంతంగా భూములు లాక్కోవడం అన్యాయమన్నారు. హైవే పనులు వల్ల దుమ్ము ధూళితో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. రైతులకు న్యాయం చేయకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. రైతుల ఆందోళనకు తెలుగు దేశం నాయకులు రోషన్ కుమార్,రావూరి కృష్ణ, పెనుమర్తి రామ్ కుమార్ మద్దతు తెలిపారు.