ముమ్మరంగా జంగిల్ క్లియరెన్స్ పనులు- రాజధాని రైతుల సంతోషం - farmers About Jungle Clearance

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2024, 11:50 AM IST

thumbnail
ముమ్మరంగా జంగిల్ క్లియరెన్స్ పనులు- రాజధాని రైతుల సంతోషం (ETV Bharat)

Farmers Happiness About Jungle Clearance in Amaravati Area : అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యానికి సాక్ష్యంగా నిలువెత్తుగా పెరిగిన ముళ్ల చెట్లను శరవేగంగా తొలగిస్తున్నారు. దీంతో రాజధాని ప్రాంతంలోని భవనాలు, ఇతర నిర్మాణాలు దూరం నుంచి స్పష్టంగా దర్శనమిస్తున్నాయి.  పూర్తిస్థాయి సచివాలయ నిర్మాణానికి అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు వేసిన శిలాఫలకం బయటపడటంతో రాజధాని రైతులు సంతోషం వ్యక్తం చేశారు.


వైఎస్సార్సీపీ పాలనలో ఐదేళ్లుగా పాడుబడిన రాజధాని ప్రాంతం మళ్లీ కొత్త కళను సంతరించుకుంటోంది. జంగిల్ క్లియరెన్స్  పనులు జోరుగా సాగుతుండగా ఆ తర్వాత రాజధానిలో రహదారులు బాగు చేస్తామని సీఆర్​డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ చెప్పిన సంగతి తెలిసిందే. శర వేగంగా జరుగుతున్న జంగిల్​ క్లయరెన్స్ పనుల పట్ల రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పెద్ద ముళ్ల పొదలను తొలగించడంతో  భవంతులు, శిలా పలకాలు బయట పడుతున్నాయని. ఇన్నోళ్లు జగన్​ చేసిన అరాచకానికివే నిదర్శనమని స్థానికులు ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.