గుర్తు తెలియని వ్యక్తుల దుశ్చర్య- కాడెద్దు సహా 10ట్రాక్టర్ల గడ్డికి నిప్పు - Farmer ten lakh loss in Anantapur
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 10, 2024, 12:19 PM IST
Fire Accident in Anantapur District : అర్ధరాత్రి దుండగులు నిప్పు పెట్టడంతో 10 ట్రాక్టర్ల గడ్డితో సహా ఒక కాడెద్దు కోల్పోయాడో రైతు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. రైతు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని కందుకూరు మండల కేంద్రంలో జయచంద్ర ఓ 10 ట్రాక్టర్ల గడ్డివామి ఉంచాడు. కాడెద్దులను కూడా అక్కడే వదిలాడు. అర్ధరాత్రి దాటాక గుర్తు తెలియని వ్యక్తులు గడ్డివామికి నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలిపోయిందని, మంటల్లో చిక్కుకుని ఓ ఎద్దు మృతి చెందిందని బాధిత రైతు జయచంద్ర వాపోయాడు. ఈ మంటలకు భయాందోళనకు గురైన మరో ఎద్దు తప్పించుకుందని తెలిపాడు.
రైతు జయ చంద్ర తన షెడ్డులో ఎద్దులు కట్టివేసి ఉండగా దుండగులు చేసిన పనికి తీవ్ర నష్టం జరిగింది. గడ్డివామి, ఎద్దులు, షెడ్డు కలిపి సుమారు పది లక్షల రూపాయల దాకా ఉంటుందని రైతు కుమారుడు ప్రవీణ్ తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకోని మంటలను అదుపు చేసినా అప్పటికే తీవ్రంగా నష్టపోయామని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.