కళ్లముందే పంటను తొక్కించిన అధికారులు- రైతు ఆత్మహత్యాయత్నం - farmer suicide attempt
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 20, 2024, 10:11 PM IST
farmer suicide attempt Due to non payment of compensation: జాతీయ రహదారి విస్తరణకు పొలం స్వాధీనం చేసుకుని తనకు డబ్బు చెల్లించలేదని కడప జిల్లా మైదుకూరు గడ్డంవారిపల్లెకు చెందిన రైతు కశెట్టి చెండ్రాయుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. పదిరోజుల్లో చేతికందే పంటను, అధికారులు జేసీబీతో చదును చేశారని రైతు వాపోయాడు. అడ్డుకునే ప్రయత్నం చేసినా యంత్రాలతో తొక్కించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు రైతు చెండ్రాయుడు తెలిపారు.
మైదుకూరుకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, తన తమ్ముళ్లు ఇరువురు కుమ్మకై పరిహారం అందకుండా చేశారని రైతు ఆరోపించారు. జిల్లాలో 67 జాతీయ రహదారికి సంబంధించి మైదుకూరు ప్రాంతంలో విస్తరణ పనులు జరుగుతున్నాయి. రోడ్డు విస్తరణలో తన పొలం పోయిందని పరిహారం కోసం గత 8 నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నట్లు తెలిపారు. అధికారులు పట్టించుకోలేదని రైతు ఆరోపించారు. విధిలేని పరిస్థితుల్లో పురుగుల మందు తాగాల్సి వచ్చిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.