చనిపోతూ ఆరుగురికి ప్రాణం పోసిన మహిళ - Brain Dead Woman Organs Donate

🎬 Watch Now: Feature Video

thumbnail

Family Members Donate Brain Dead Woman Organs : తాను మరణిస్తూ ఆరుగురికి ప్రాణం పోశారు గుడివాడకు చెందిన మహిళ. మైనపు ధనలక్ష్మి నాలుగు రోజుల కిందట బజారికి వెళ్లి వస్తూ హఠాత్తుగా కళ్లు తిరిగి రోడ్డుపైనే పడిపోయారు. ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయగా వైద్యులు తలలో నరాలు చిట్లాయని తేల్చారు. బీపీ పెరగటంతో రక్తపోటు వచ్చిందని చెప్పారు. వెంటనే ధనలక్ష్మిని విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తలలో నరాలు చిట్లటంతో ఆమెకు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు చెప్పారు. అవయవదానం గురించి కుటుంబసభ్యులకు వివరించారు. 

ధనలక్ష్మికి ఆనంద్, అశోక్ అనే ఇద్దరు కుమారులున్నారు. భర్త ఏసుబాబు కూలీ పనిచేస్తుంటారు. ఆనంద్ 15 సార్లు రక్తదానం చేశారు. అవయవదానంపై అవగాహన ఉండటంతో కుటుంబసభ్యులు అంగీకరించారు. ఊపిరితిత్తులు, గుండె, లివర్, కిడ్నీ, కళ్లను దానం చేయనున్నారు. జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా వీటి తరలింపుకు చర్యలు చేపట్టారు. చెన్నైలోని ఎంజీఎం, తాడేపల్లి మణిపాల్​తో పాటు మరికొన్ని ఆసుపత్రులకు అవయవాలను పంపనున్నారు. ధనలక్ష్మి చనిపోయినా కొందరికి ప్రాణదానం చేస్తున్నందుకు కుటుంబ సభ్యులు గర్వపడుతున్నారు. అందరూ అవయవదానంపై అవగాహన పెంచుకోవాలని కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.