బండి సంజయ్‌కి కేంద్రమంత్రి పదవి - సంబురాలు చేసుకున్న కుటుంబసభ్యులు - Family Celebrations At Bandi Sanjay Home - FAMILY CELEBRATIONS AT BANDI SANJAY HOME
🎬 Watch Now: Feature Video
Published : Jun 9, 2024, 6:41 PM IST
Family Celebrations At Bandi Sanjay Home Karimnagar : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కి కేంద్రమంత్రి పదవి దక్కడం పట్ల తెలంగాణలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్‌లోని బండి సంజయ్ నివాసంలో కుటుంబ సభ్యులు సంబురాలు జరుపుకున్నారు. కార్యకర్తలు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. బండి సంజయ్‌ను తెలంగాణ కాషాయ దళపతిగా పిలుచుకునే బీజేపీ కార్యకర్తల ఆనందానికి ఆవధుల్లేకుండా పోయాయి. సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవంగా వారు భావిస్తున్నారు.
Bandi Sanjay Fans Celebrations in Karimnagar : బీజేపీ పార్టీలో కార్యకర్తగా చేరింది మొదలు ఏ పదవిలో ఉన్నా నిరంతరం ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు చేయడమే లక్ష్యంగా పనిచేసిన బండి సంజయ్‌కు అమాత్య పదవి లభించడం, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కావడం విశేషం. సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి లభించడం పట్ల కరీంనగర్ పార్లమెంట్ ప్రజల్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. కేంద్రమంత్రి వర్గంలో తెలంగాణ బీజేపీ ఎంపీలకు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు చోటు దక్కింది. కరీంనగర్ నుంచి బండి సంజయ్ మొదటిసారి కేంద్రమంత్రి వర్గంలో అడుగుపెట్టనున్నారు.