పత్తి చేనులో మొసలి ప్రత్యక్షం - అధికారులొచ్చేలోపు పక్కనున్న బావిలోకి - చివరకు? - Police caught crocodile
🎬 Watch Now: Feature Video
Forest officers caught a crocodile in Jogulamba District : జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్లో బావిలో తలదాచుకున్న మొసలిని 5 గంటల పాటు శ్రమించి అటవీ అధికారులు బంధించారు. వివరాల్లోకి వెళితే పత్తి చేనులో పని చేస్తున్న కూలీలకు మొసలి కనిపించడంతో భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ ఆఫీసర్స్ వచ్చి మొసలి కోసం గాలించగా, బావిలోకి దిగి తలదాచుకుంది. మకరాన్ని తాళ్లతో బంధించేందుకు ఐదు గంటల పాటు శ్రమించారు. బావిలోంచి లాగేందుకు నానా కష్టాలు పడ్డారు. చివరకు మొసలిని బావిలో నుంచి పైకి తీసుకొచ్చి ట్రాక్టర్‌లో తరలించి కృష్ణా నదిలో వదలిపెట్టారు. మొసలిని పైకి తెచ్చే ప్రయత్నంలో స్థానికుల సహకారం మరువలేనిదని పోలీసులు వారిని అభినందించారు. ఈ క్రమంలోనే పాములు, మొసళ్లు, అడవి జంతువులు వంటివి ఏవైనా జనారణ్యంలోకి వస్తే, వాటికి ప్రాణహాని తలపెట్టొద్దని, అటవీ అధికారులకు సమాచారం అందించాలని గ్రామస్థులకు సూచించారు.