ప్రచారానికి వస్తున్న వైసీపీ నేతలకు కరవు కనిపించడం లేదా?: కాంగ్రెస్ నేత సాకే శైలజానాథ్ - EX PCC Saake Fires On YSRCP - EX PCC SAAKE FIRES ON YSRCP
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 31, 2024, 6:19 PM IST
EX PCC Saake Shailaja Nath Fires On YSRCP Government : అనంతపురం జిల్లాకు ఎన్నికల ప్రచారానికి వస్తున్న వైఎస్సార్సీపీ నేతలకు జిల్లాలో కరవు కనిపించలేదా అని పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ప్రశ్నించారు. జిల్లాకు రావాల్సిన 125 టీఎంసీల (TMC)ల నీరు గురించి ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ఎండిన పంటలు, తోటలతో రైతుల బాధలు కనిపించడం లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్ర పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. ప్రచారంలో కేవలం ఓట్ల కోసం కాకుండా రైల్వే జోన్, కడప ఉక్కు, రాజధాని, అభివృద్ధి గురించి మాట్లాడాలన్నారు. జిల్లాలో సాగు, తాగు నీటిపై కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
జిల్లాలో గతంలో మాదిరిగా రైతులు పంటలు వేసుకునే పరిస్థితి లేదన్నారు. అప్పర్భద్ర ప్రాజెక్టు కట్టిన తర్వాత అనంతపురం జిల్లా ఎడారిగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు పట్టించుకోని నాయకులకు ఓట్లు అడిగే హక్కు లేదని మండిపడ్డారు.