Isro Chairman v Narayanan Visited Tirumala : తిరుమల శ్రీవారిని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ సినీ గాయని సునీత వేరువేరుగా దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఇస్రో ఛైర్మన్ నారాయణన్ కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న నారాయణన్ కు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
రేపు GSLV- F15 ప్రయోగం జరగనుందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు.సెకండ్ జనరేషన్, సెకండ్ నావిగేషన్ శాటిలైట్ ఎన్వీఎస్-02 మిషన్‌తో శ్రీహరికోట నుంచి 100వ ప్రయోగం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మొదటి ప్రయోగం ఎస్ఎల్వీ- ఈ3 1979 సంవత్సరంలో ప్రారంభించామన్నారు. కొద్ది సంవత్సరాలలోనే ఆరో జనరేషన్‌కు సంబంధించిన లాంఛ్ మిషన్లు అభివృద్ధి చేశామని తెలిపారు.
టీ-20 సిరీస్ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా - మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన నితీశ్ కుమార్‌రెడ్డి
Singer Sunitha Visits Tirumala : సినీ గాయని సునీత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన గాయని సునీతతో ఫొటోలు తీసుకునేందుకు పిల్లలు, మహిళలు పెద్ద ఎత్తున ఉత్సాహం చూపారు.
తిరుమల శ్రీవారి సేవలో హీరో అఖిల్ అక్కినేని, ఏపీ సీఎస్ నీరభ్ కుమార్