తెలుగుదేశంలోనే ఉంటా - లోకేశ్‌కు స్పష్టం చేసిన జలీల్ ఖాన్ - లోకేశ్ ను కలిసిన జలీల్ ఖాన్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 29, 2024, 8:09 PM IST
Ex MLA Jaleel Khan meets Nara Lokesh: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పార్టీ మారుతారనే ఊహాగానాలపై స్పష్టతనిచ్చారు. జలీల్ ఖాన్ పార్టీ మార్పు అంశంపై స్పందించారు. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని వెల్లడించారు. టీడీపీలోనే కొనసాగుతానని తెలిపారు. విజయవాడ పశ్చిమ సీటు నుంచి తెలుగుదేశం, జనసేన పొత్తులో భాగంగా రెండు పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా జలీల్ ఖాన్‌కు కాకుండా మరో నేతకు టికెట్ కేటాయించే అంశాన్ని అధిష్టానం పరిశీలిస్తోంది. అందుకోసమే అసంతృప్తితో ఉన్న జలీల్ ఖాన్‍ను వెంట పెట్టుకుని కేశినేని చిన్ని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ వద్దకు తీసుకొచ్చారు. జలీల్ ఖాన్ నారా లోకేశ్‌తో భేటీ అయ్యారు. తాను తెలుగుదేశంలోనే ఉంటానని జలీల్‍ఖాన్ స్పష్టం చేసినట్లు సమాచారం. జలీల్ ఖాన్ రాజకీయ భవిష్యత్తుకు నారా లోకేశ్ హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ముస్లింల మద్దతు కూడగట్టి తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడతానని జలీల్ ఖాన్ స్పష్టం చేసినట్లు టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి.