వైఎస్ షర్మిల ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పలేకపోతున్నారు: టీడీపీ నేత వీర శివారెడ్డి - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 28, 2024, 8:07 PM IST
EX MLA Fire On CM Jagan: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలిట షర్మిల కాళికామాత అని తెలుగుదేశం నేత వీర శివారెడ్డి అన్నారు. షర్మిల సంధించే ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పలేక భయపడుతున్నారని శివారెడ్డి ఎద్దేవా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కిపోయిందన్నారు. చంద్రబాబు అధినేత నమ్మకంతో తనను పార్టీలో చేర్చుకున్నారని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం - జనసేన విజయానికి తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఏదో ఆశించి తెలుగుదేశంలోకి రాలేదని, తన అనుభావాన్ని తెలుగుదేశం విజయానికి ఉపయోగించడానికే పార్టీ మారినట్లు శివారెడ్డి తేల్చి చెప్పారు. ఇసుక, మద్యం, మైనింగ్ వంటి ద్వారా ప్రజాధనాన్ని దోచుకుని దాచుకున్నారని ఆరోపించారు. రాజశేఖర్ రెడ్డి రాజకీయ లక్షణాలు జగన్‌లో ఒక్క శాతం కూడా లేవని ఎద్దేవా చేశారు.
"ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగి. 150 సీట్లు తీసుకుని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి లేని రాష్ట్రంగా 30 ఏళ్లు వెనక్కి తీసుకున్నారు. దోచుకో దాచుకో అనే నినాదంతో జగన్ పరిపాలన పక్కన పెట్టేశాడు." - వీర శివారెడ్డి, తెలుగుదేశం నేత