జనసేన పార్టీలో చేరుతున్న మాజీ మంత్రి - పవన్‌ ఆశయాలు నచ్చి చేరుతున్నట్లు వెల్లడి - Leaders who joined Janasena

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 8:10 PM IST

Former Minister Kothapalli Subbarayudu Joining In Janasena Party: ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ రోజురోజుకి పుంజుకుంటోంది. పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల్లో సత్తా చాటిన జనసేన ఇప్పుడు చేరికలతో ఉత్సాహంతో ముందుకు వెళ్తోంది. తాజాగా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు (Former Minister Kothapally Subbarayudu) త్వరలో జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. 

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆయన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena chief Pawan Kalyan) ఆశయాలు, నిబద్ధత, సిద్ధాంతాలు ఉన్న గొప్ప నాయకుడని అన్నారు. రాజధాని, ప్రత్యేక హోదా, అమరావతి రైతులు, రైల్వే జోన్ కోసం పదేళ్లుగా పవన్ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఎటువంటి స్వార్థ ప్రయోజనం లేకుండా ఆయన చేస్తున్న పోరాటాలు నచ్చే జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. త్వరలో అభిమానులతో కలసి పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరతామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.