వైఎస్సార్సీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు అన్ని వర్గాలు సిద్ధం : గంటా - గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 28, 2024, 4:57 PM IST
EX Minister Ganta Srinivasa Rao: భీమి సభలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై పలువురు రాజకీయ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సభ సాక్షిగా ముఖ్యమంత్రి అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి, భీమిలిలో నిర్వహించిన 'సిద్ధం' సభలో అవాస్తవాలను ఎలా మాట్లాడగలిగారని గంటా ప్రశ్నించారు. అబద్దాలు చెప్పి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను మోసం చేయలేరని అభిప్రాయం వ్యక్తం చేశారు. పేదల పక్షాన పోరాడుతున్నానన్న జగన్ దేశంలోనే రిచెస్ట్ సీఎంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ అరాచకపాలనపై, జగన్ వదిలిన బాణం అడుగుతున్న ప్రశ్నలకు ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలన్నారు.
"నాకు మీడియా లేదు. నాకు ఎవరూ బ్రాండ్ అంబాసిడర్లు లేరు. ప్రజలే నా బ్రాండ్ అంబాసిడర్లు అని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి పచ్చి అబద్దాలు ఎలా చెప్పగల్గుతున్నారు. మీ నాన్న ముఖ్యమంత్రి కాకముందు మీ పరిస్థితి ఏంటి" - గంటా శ్రీనివాస రావు, మాజీ మంత్రి