Kakinada Port Sale Issue : వైఎస్సార్సీపీ పాలనలో కాకినాడ సీ పోర్ట్, సెజ్‌లోని రూ.3609 కోట్ల వాటాలు బలవంతంగా లాక్కున్న వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. సీఐడీ, ఈడీ ఉచ్చు బిగుస్తుండడంతో అరబిందో సంస్థ వెనక్కి తగ్గింది. యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) నుంచి బలవంతంగా లాక్కున్న కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ (కేఎస్‌పీఎల్) వాటాలు తిరిగి అప్పగించేందుకు అంగీకారం తెలిపింది.
దీనిపై ఇరువర్గాల మధ్య అంగీకారం కుదిరినట్లు తెలిసింది. ఈ ప్రక్రియ కొద్దిరోజుల్లో పూర్తికానున్నట్లు తెలుస్తోంది. వాటాల బదిలీ సమయంలో అప్పట్లో అరబిందో సంస్థ ఇచ్చిన మొత్తాన్ని వడ్డీతో కలిపి చెల్లించేందుకు కేవీ రావు అంగీకరించినట్లు తెలిసింది. అయితే సెజ్ వాటాలను ఆయన పేరిట బదలాయించే విషయమై చర్చలు ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది. ఈ విషయాన్ని కూడా త్వరగా తేల్చాలని కర్నాటి వెంకటేశ్వరరావు పట్టుపడుతున్నట్లు సమాచారం.
జగన్ సర్కార్‌లో తనపై కేసులు పెడతామని, జైలుకు పంపుతామని బెదిరించారని కేవీ రావు గత సంవత్సరం సీఐడీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనను ఒత్తిడి చేసి మరీ కేఎస్‌పీఎల్‌లోని రూ.2500 కోట్ల విలువైన వాటాలు రూ.494 కోట్లకు, కాకినాడ సెజ్‌లోని రూ.1109 కోట్ల విలువైన వాటాలను రూ.12 కోట్లకు బలవంతంగా లాక్కున్నారని చెప్పారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీఐడీ వై.విక్రాంత్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, పి.శరత్‌చంద్రారెడ్డి, పీకేఎఫ్ శ్రీధర్- సంతానం ఎల్‌ఎల్‌పీ, అరబిందో రియాలిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో పాటు డైరెక్టర్లు తదితరులను అప్పట్లో నిందితులుగా చేర్చారు.
KV Rao and Aurobindo Disputes : అయితే ఈ కేసులో మనీ రూటింగ్, లాండరింగ్ అంశాలపై ఈడీ కూడా దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట నిందితులతో పాటు ఫిర్యాదుదారుడూ హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ఈ వివాదం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని కీలక నాయకుల మెడకు చుట్టుకోవడంతోపాటు అరబిందోకు ఇబ్బందిగా మారడంతో కేవీ రావుతో రాజీకి వచ్చినట్లు సమాచారం.
కాకినాడ సెజ్‌లో జేగ్యాంగ్ దోపిడీ - రైతుల భూములు లాక్కున్న దాడిశెట్టి రాజా
జగన్ మరో దాష్టీకం వెలుగులోకి - రాక్షస రాజకీయంతో కాకినాడ పోర్టు అరబిందో పరం!