సమయమివ్వకుండానే స్పందించమని నోటీసులిచ్చారు : వైఎస్సార్సీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం
🎬 Watch Now: Feature Video
EX Minister Anam Narayana: పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసిన అంశంలో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు స్పందించారు. నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ కాగా, వారిలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. ఈ నెల 29న తమ ఎదుట హాజరు కావాలని స్పీకర్ ఆదేశించినట్లు వెల్లడించారు. దీనిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో చర్చించి, న్యాయ సలహాలు, సూచనల మేరకు తదుపరి తమ స్పందనను వెల్లడిస్తామని ఆయన చెప్పారు. నోటీసులు చీఫ్ విప్, స్పీకర్ కార్యాలయం నుంచి వచ్చాయని తెలిపారు. ఈ నోటీసులపై పూర్తి స్పష్టతను ఇచ్చేందుకు తమకు రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుందని తాము సమాధానం ఇచ్చినట్లు పేర్కోన్నారు. తాము పంపిన సమాధానం కవర్ అందక ముందే సమయం ఇవ్వడం కుదరదని మరో నోటీసు జారీ చేశారని వివరించారు. అందులో సమయం ఇవ్వడం కుదరదని తప్పకుండా ఈనెల 29న హాజరు కావాల్సిందేనని వచ్చినట్లు వివరించారు. గంటా శ్రీనివాస్ మూడు సంవత్సరాల క్రితం రాజీనామా లేఖను అందిస్తే ఇప్పుడు అమోదించారని, అది కూడా రాజీనామాను ఆమోదించే ముందు మరోసారి సంప్రదించాలన్న సంప్రదయాన్ని స్పీకర్ కార్యాలయం పాటించలేదని ఆనం చెప్పారు.