స్వర్గీయ రామోజీరావుకు ఈటీవీ మాజీ వ్యాఖ్యాతల బృందం నివాళులు - ETV Ex Anchors Tribute to Ramoji - ETV EX ANCHORS TRIBUTE TO RAMOJI
🎬 Watch Now: Feature Video
Published : Jun 16, 2024, 8:15 PM IST
ETV Ex Anchors Tribute to Ramoji Rao : రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల తెలుగువారే కాదు తెలుగు భాష సైతం బాధపడుతోందని ఈటీవీ మాజీ వ్యాఖ్యాతలు అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు. జీవితంలో ఈటీవీతో అనుబంధాన్ని సాగించి అనేక పాఠాలు నేర్చుకున్నామని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఆయా టీవీ ఛానల్‌తో పాటు ఎక్కడికి వెళ్లినా తమ వాచకాన్ని చూసి ఈటీవీలో పనిచేశారు అని గుర్తిస్తున్నారని, అంతటి విశ్వసనీయత కేవలం ఈటీవీకే సాధ్యమని అన్నారు.
ఈటీవీని ఆ స్థాయిలో నిలబెట్టిన స్వర్గీయ రామోజీరావు సదాస్మరణీయులని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తొలినాళ్లలో ఎన్నో వైఫల్యాలు చూసిన తమకు ఈటీవీ నీడనిచ్చి ఆకలికి తీర్చిందని అందుకు రామోజీరావుకు ధన్యవాదాలు తెలియజేశారు. వేల మందికి ఈనాడు, ఈటీవీలను ఇంటిపేరుగా మార్చిన రామోజీరావు మన మధ్య లేకపోవడం బాధాకరమని ఆయన మృతి పట్ల రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు.